సారా బట్టీల గుట్టు రట్టు..!
– టాస్క్ఫోర్స్, పోలీసుల సంయుక్త దాడులు
– 10 లీటర్ల సారా.. నల్లబెల్లం స్వాదీనం
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని గ్రామీణ సరిహద్దు ప్రాంతాల్లో నాటు సారా గుప్పుమంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్టు సాగిస్తున్న సారా వ్యవహారంను సీరీయస్గా తీసుకున్న విజిలెన్స్ అధికారులు బట్టీల గుట్టును రట్టు చేశారు. ఆదివారం పెద్దేముల్ మండలం తట్టెపల్లి గ్రామ శివారులో నాటు
సారా తయారీ బట్టీలపై స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మొత్తం మూడు బట్టీలపై దాడులు నిర్వహించి తయారీ సామాగ్రిని ధ్వంసం చేశారు. అదేవిధంగా 10 లీటర్ల నాటు సారా, నల్ల బెల్లం స్వాదీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇద్దరు సారా తయారిదారులను అదుపులోకి తసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేస్తామని తాండూరు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

