డమాల్.. డేంజర్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

డమాల్.. డేంజర్..!
– జనావసాల మద్య టపాసుల దుకాణాలు
– రూల్స్‌కు విరుద్దంగా వ్యాపారాలు
– ఏమైతే.. మాకేంటీ.. అనే ధోరణిలో అధికారులు
– తాండూరుకు బొగ్లుల కుంట ఘటన భయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దీపావళీ పండగ ఎక్కడ విషాధంగా మారుతుందో అని తాండూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనావాసాల మధ్య దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఏ వైపు నుంచి బాంబు రూపంలో ప్రమాదం దూసుకొస్తుందోని చుట్టుపక్కల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. హైదారాబాద్‌లోని ఆబిడ్స్ బొగ్గుకుంటలో జరిగిన అగ్ని ప్రమాదం భయం పట్టణ వాసులను వెంటాడుతోంది. దుకాణాల విషయంలో దృష్టిసారించాల్సిన అధికార యంత్రాంగాలు ఏమైతే మాకేంటీ అనే ధోరణి ఉన్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి యేడాది దీపావళీ పండగ ముందు పట్టణంలో టసాసుల విక్రయాల గోదాములు, దుకాణాలు ఏర్పడుతూ ఉంటాయి.

పండగ పేరుతో జేబు నింపుకోవాలని చూసే వారు తప్పా.. ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం.. వారిని ఎవ్వరు పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది. ఈసారి కూడా దీపావళీ సందర్భంగా పట్టణంలో భారీగా బాణాసంచా దుకాణాలు వెలువడ్డాయి. ఒకటి రెండు, మినహా.. మిగతా దుకాణాలు జనావాసాల మద్య ఏర్పాటు అయ్యాయి. భారీగా దుకాణాలు వెలసినా.. జోరుగా విక్రయాలు కొనసాగినా… ఏ ఒక్క దానికి అనుమతులు లేకపోవడం గమనార్హం. దుకాణాలు, గోదాంలు ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, పోలీసు శాఖ, ఫైర్ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అనుమతులు పొందినా కూడా జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేపట్టాలి. కానీ తాండూరు పట్టణంలో దాదాపు అన్ని దుకాణాలు అనుమతులకు విరుద్దంగా ఏర్పాటైనవే. అనుమతులు పొందకపోవడం.. దుకాణాల ఏర్పాటు తరువాత నిబంధనలు పాటించకపోవడం భయాందోళన కలిగించే అంశం. అనుమతులు, నిబంధనలను తుస్సుమని అనిపించి.. జనావాసాల మద్య దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు గడప దాటి తనిఖీలు చేసి.. చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

నిబంధనలు ఇవే…
టపాసుల దుకాణానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
హోల్‌సేల్‌ దుకాణానికి రూ.2500, నామమాత్రపు దుకాణానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఫైర్‌ శాఖతోపాటు పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి.
ఈ లైసెన్సులు 15 రోజుల కోసం మాత్రమే వర్తిస్తాయి.
పండుగ తర్వాత రెండు రోజులు మాత్రమే దుకాణాలు ఉంచాలి.
ప్రతీ దుకాణం వద్ద ఫైర్‌ ఎక్స్‌టెన్షనల్‌ (అగ్నిమాపక పరికరాలు) తప్పనిసరిగా ఉంచాలి
200 లీటర్ల వాటర్‌ బ్యారల్‌ ఉంచాలి. నాలుగు ఇసుక బకెట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఆరు నీటి బకెట్లను ఏర్పాటు చేసుకోవాలి.
దుకాణం రేకుల ద్వారా ఏర్పాటు చేయాలి. పాత కరెంట్‌ తీగలు ఉంచరాదు. జాయింట్‌ కేబుల్స్‌ వాడవద్దు.
ల్యాంప్‌లు, పెట్రోమ్యాక్స్‌లు దుకాణాల వద్ద ఉంచరాదు. జనరేటర్‌ 15 నుంచి 20 మీటర్ల దూరంలో ఉండాలి.
దుకాణంలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారే పనిచేయాలి.
గోదాం ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి
దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదు.
టపాసుల గోదాముల వద్ద 1620 ఎల్‌పీఎం మోటార్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

ఇదికూడా చదవండి…

బల్దియా భవనంపై కబ్జా పడగ..!