రేపు మిషన్ భగీరథ బంద్
– నిలిచిపోనున్న తాగునీటి సరఫరా
– ఎందుకోసమో ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిపోతుంది. ఈ విషయాన్ని ఆ శాఖ డీఈ విజయ్ కుమార్ ప్రకటించారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల మండలంలోని గ్రామాలకు సోమవారం నీటి సరఫరా జరగదని చెప్పారు. నీటి సరఫరా జరిగే పైపులైన్లకు పలు ప్రాంతాల్లో మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా రేపు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా జరగదని స్పష్టం చేశారు. కావున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో నీటి అవసరాలను తీర్చుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి….

