తాండూరు రూరల్ సీఐ బదిలీ..!
– పరిగి సీఐగా ట్రాన్సఫర్..?
– ఇక్కడ పనిచేసింది నెలరోజులే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు పోలీసు వర్గాలలో చర్చ జరుగుతోంది. గతంలో తాండూరు రూరల్ సీఐగా పనిచేసిన అశోక్ కుమార్‌పై ఇసుక రవాణా విషయంలో అభియోగాలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రూరల్ సీఐగా శ్రీనివాస్ రెడ్డి గతనెల అక్టోబర్ 19వ తేదిన బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా నెల రోజుల తరువాత ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేసినట్లు తెలిసింది. తాండూరు నుంచి పరిగి సీఐగా బదిలీ చేసినట్లు సమచారం. అయితే నెల రోజుల్లోనే సీఐ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదికూడా చదవండి…

