పాత పెన్షన్ విధాన్ని సాధించుకుందాం
– ఓపీఎస్ సంకల్ప యాత్రకు మద్దతివ్వాలి
– తాండూరులో గోడపత్రిక ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీపీఎస్ ఉద్యోగులందరు ఐక్యమై పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసుకుందామని ఉద్యోగులు అన్నారు. ఈనెల 16వ తేదిన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ప్రారంభమైన పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు సంబంధించిన గోడ పత్రికను తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అనిల్ కుమార్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమ లు కోసం ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. మన కోసం, మన కుటుంబాల కోసం ఉద్యమించాలన్నారు. అబి నహీతో కబీ నహీ అనే నినాదంతో వచ్చేనెల 12న నిర్వహించే చలో హైదరాబాద్కు సైతం మద్దతు తెలపాలన్నారు. ఓపీఎస్ సంకల్ప యాత్రకు అందరు తరలివచ్చి మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సీపీఎస్ ఉద్యోగులు సీ.ఆంజనేయులు, జూనియర్ అసిస్టెంట్ నీరటి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ ఉమేష్, రవీందర్, అనంతయ్య, రాములు, సందీప్, నర్మదా, బిల్ కలెక్టర్ నాగేందర్, పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


