కుటుంబ సర్వేతో అందరికి లబ్ది..!
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పట్టణంలో సర్వేలో తన వివరాల నమోదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రభుత్వం కుటుంబ సర్వేను చేపట్టిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం శాంతినగర్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సర్వే వివరాలను తెలియజేశారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు, ఆస్తులు, ఇతర వివరాలు నమోదుచేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అందరు బాధ్యతగా వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. ఈ సర్వే పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సర్వే చె ట్టిందన్నారు. ఇందుకు ప్రజలందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

