మోడల్ స్కూల్‌ పిలుస్తోంది…!

కెరీర్ తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

మోడల్ స్కూల్‌ పిలుస్తోంది…!
– 6-10 క్లాస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
– ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
– గడువు, పరీక్ష తేదిల ప్రకటన
– ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 -26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నారు. జనవరి 6, 2025వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. దాని ద్వారా 2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రవేశాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించించింది. దరఖాస్తుల కోసం http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తుల జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రవేశాల కోసం ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 13, 2025వ తేదీన జరగుతుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గురుకుల పాఠశాలలో కూడా ప్రవేశాలు
మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం 2025 – 26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో జరిగే ప్రవేశ పరీక్ష కోసం అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. https://tgswreis.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ..!