పేదలందరికి పెన్షన్…!
– కొత్త పథకాన్ని తీసుకోస్తున్న కేంద్రం
– కార్మికులు, గిగ్ వర్కర్లకు వర్తింపు
– ఎప్పుడు.. ఎలా అమలు చేస్తారంటే..?
దర్శిని డెస్క్ : దేశంలోని పేదలందరికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. అందించబోతోంది. దరఖాస్తు చేసుకున్న పేదలకు పెన్షన్ అందిచేందుకు యూనివర్సన్ ఫించన్ స్కీం(సార్వత్రిక ఫెన్షన్ స్కీం) అందరికీ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలతో చర్చు జరుపుతోంది. మన దేశంలో చాలా మంది పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి నెలా వచ్చే ఆ డబ్బు వారికి ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా కొంతవరకూ అది వెన్నుదన్నుగా నిలుస్తుంది. అందుకే కేంద్రం.. త్వరలోనే అందరికీ పెన్షన్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతోందని తెలిసింది.

కేంద్రం ప్రకారం చిన్నవ్యాపారులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న పారు, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేసుకున్నవారికి.. 60 ఏళ్ల తర్వాత నుంచి పెన్షన్ లభిస్తుంది. ఐతే.. ఇది అమలయ్యాక.. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న పెన్షన్లు కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అంటే.. ఏదో ఒక పెన్షన్ మాత్రమే లభిస్తుంది. ఏది ఎక్కువ ఉంటే అది ఇచ్చేలా చేస్తారు. ఇది అందరికీ పెన్షన్ పథకం అయినప్పటికీ.. అవసరం లేని వారికి ఇది అమలవ్వదు. ఎవరైతే పెన్షన్ కోరుకుంటున్నారో.. వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరం లేని వారు అవకాశాన్ని వదులుకోవచ్చు. అసలు కేంద్రం పేదల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకం తేవాలనుకుంటోంది. అందువల్ల పేదలందరికీ పెన్షన్ ఇవ్వడమే దీని ముఖ్యమ ఉద్దేశం. ఈ కొత్త పథకంపై ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) కసరత్తు చేస్తోంది. జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్‌పీఎస్) ఇకపైనా యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ పథకం అమలైతే.. ఇది దేశంలోని సంచలన పథకాల్లో ఒకటి అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఐతే.. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చేదీ ఇంకా తేదీ ఫిక్స్ కాలేదు. 2027లో జమిలి ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
ఇదికూడా చదవండి…

