హంగామా వద్దు.. హడావుడి ఉండొద్దు..!
– మద్యం, డీజేలపై నిషేధం
– దొరికితే కేసులు, జరిమానాలు
– న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
– హెచ్చరించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నూతన సంవత్సరం పేరుతో చేసే హంగామాలో ఎవ్వరు కూడా హడావుడి చేయరాదని, మద్యం తాగడం, డీజేలు పెట్టడం చేస్తే కేసులు, జరిమానాలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. ప్రతి యేడాది మాదిరిగానే డిసెంబర్ 31, జనవరి 1 సంబరాలకు ప్రజలు, యువత సిద్దమవుతున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలను ప్రజలకు వెల్లడించారు.
తాండూరు సబ్ డివిజన్ పరిధిలో డీజేలకు అనుమతులు నిషేధించడం జరిగిందన్నారు. ఎవ్వరు కూడా న్యూఇయర్ డీజేలు పెట్టరాదన్నారు. గుంపులు, గుంపులుగా వేడుకలు జరుపుకోరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున ఈ రెండు రోజులు ఎక్కడికక్కడ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. మద్యం తాగి రోడ్లమీదకు వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ నిబంధనలు అతిక్రమించి డీజేలు పెట్టినా, మద్యం సేవించి పట్టుబడినా ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరికి వారు వారి వారి ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

