చూడ ముచ్చటగా ఇందిరమ్మ ఇళ్లు..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

చూడ ముచ్చటగా ఇందిరమ్మ ఇళ్లు..!
– ఇంటి నిర్మాణ ప్లాన్‌ను ప్రకటించిన ప్రభుత్వం
– ప్రతి నియోజకవర్గంలో మోడల్‌ ఇళ్ల నిర్మాణం
– విస్తీర్ణం.. ఎన్ని నిధులతో నిర్మిస్తన్నారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్లాన్‌ను ప్రకటించారు. నిరుపేదల గూడు కోసం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల నమూనా అందరికి తెలియజేసేలా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ ఇంటిని నిర్మించనున్నారు. వీటి కోసం రూ.5 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. 20×20 చదరపు అడుగుల సైజులో నిర్మించే ఇంటికోసం ముందర 9.0×10.0 సైజు హాలులో ఆగ్నేయంలో 6.9×10.0 సైజులో వంటగది ఉంటుంది. 12.5×10.5 సైజులో బెడ్‌రూం, అందులోనే అటాచ్డ్‌ బాత్‌రూం కలిపి నిర్మిస్తారు. రెండు తలుపులు, రెండు కిటికీలు, ఒక వెంటిలేటర్‌ ఉంటుంది. చూడగానే ముచ్చటగొలిపేలా ఈ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలున్నాయి. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో మోడల్ ఇళ్లను నిర్మించి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇదికూడా చదవండి…

వారం రోజులు సంక్రాంతి సెలువులు..!