పట్టణాభివృద్దే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణాభివృద్దే ధ్యేయం..!
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 4, 15వ వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాలుగేళ్లుగా కుంటుపడిన అభివృద్ధికి పరుగులు పెట్టిస్తామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధి 4వ వార్డు, 15వ వార్డులలో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్ అస్లాంలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా వివిధ కారణాలతో అభివృద్ధి చేసుకోలేకపోయామన్నారు. ప్రస్తుతం మున్సిపల్లో రూ.3.65 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని నిధులు కేటాయించాలని కోరుతామన్నారు. మున్సిపల్లో పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు బోయరవి, వెంకన్న గౌడ్, నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి