రేపే ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ మ్యాచ్..!
– ఇందూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని జర్నలిస్టులు, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ అండ్ పోలీసు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. తాండూరు సబ్ డివిజన్ పోలీసు శాఖ, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామంలో ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి యేడాది మాదిరిగానే పోలీసు, ప్రెస్ విభాగాల మద్య స్నేహ సంబంధాలు మెరుగు పడాలనే అభిలాషతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 9-30గంటలకు ఇందూరులోని క్రీడా మైదానంలో మ్యాచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్కు హాజరై విజయవంతం చేయాలని నిర్వహకులు కోరుతున్నారు.
ఇదికూడా చదవండి…

