నమో.. భద్రేశ్వర స్వామీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నమో.. భద్రేశ్వర స్వామీ..!
– భక్తులకు బుయ్యని అన్నదానం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాయంతో వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : నమో భద్రేశ్వర స్వామి నినాదాలతో పట్టణంలోని బావిగి భద్రేశ్వర స్వామీ దేవాలయం మార్మోగింది. మూడు రోజులుగా జాతర ఉత్సవాలు కొనసాగుగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా దేవాలయంలో నూతనంగా ప్రారంభించిన అన్నపూర్ణ మాత దాసోహ మందిరంలో నిత్యఅన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతోంది.

మూడో రోజు దాతగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నదానంకు సహకరించారు. దీంతో దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్, ఆలయ కమిటి సభ్యులు సమక్షంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో భద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో దేవాలయం జాతర శోభసంతరించుకుంది.

 

ఇది కూడా చదవండి….

ఏం గుండెలు సామీ.. మీవీ..!