అభిషేక్ స్పూర్తి భేష్..!

కెరీర్ క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

అభిషేక్ స్పూర్తి భేష్..!
– బాడీ బిల్డింగ్ లో సత్తా గర్వకారణం
– సన్మానించిన బీఆర్ఎస్వీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుకుంటూనే బాడి బిల్డింగ్ లో సత్తా చాటిన అభిషేక్ స్వామి స్పూర్తి భేష్ అంటూ తాండూరు పట్టణ బీఆర్ఎస్ విద్యార్ధి సంఘం(బీఆర్ఎస్వీ) నాయకులు అభినందించారు. తాండూరు పట్టణం పాత తాండూరుకు చెందిన డీగ్రీ చదువున్న పాత అభిషేక్ స్వామి హైదరాబాద్ లో అండర్ 20 విభాగంలో జరిగిన బాడి బిల్డింగ్ పోటీలలో ప్రథమ బహుమతి, మ్యాన్ ఫిజిక్ విభాగంలో తృతీయ బహుమతి సాధించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చదువుకుంటూనే ఇష్టపడిన రంగంలో అభిషేక్ స్వామి బాడి బిల్డింగ్ లో సత్తా చాటడం అభినందనీయమన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత చెడు మార్గంలో వెళ్లకుండా అభిరుచి కలిగిన రంగాల్లో రాణించాలన్నారు. అదేవిధంగా అభిషేక్ స్వామి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ సంజీవరావు, నాయకులు వినోద్, లడ్డూ, విశ్వనాథ్, నర్సింహా, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ రోడ్లకు మహర్ధశ