అరాచక పాలనకు చరమగీతమే సరి

తాండూరు రాజకీయం వికారాబాద్

అరాచక పాలనకు చరమగీతమే సరి
– తాండూరును దోచుకుంటున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– దూం..దాం..గా హస్తం ప్రచార యాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు ప్రజల చేతుల్లో చరమగీతమే సరైన గుణపాఠం అని కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార యాత్ర చేపట్టారు. పట్టణంలొ ని’ తాతగుడి, వీరనాగమ్మ గల్లీ, భవానీ నగర్, తులసీ నగర్, రాయల్ కాంట ఏరియా, శాంతి నగర్, అంబేడ్కర్ చౌరస్తా, ఖాన్ కాలనీ, రైల్వే స్టేషన్ రోడ్డు మర్గంలో కొ నసాగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి సాయిపూర్లో వెలసిన దేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్ర దూందాంగా కొనసాగింది.

ప్రచార యాత్రలో మనోహర్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అదేవిధంగా పలు చోట్ల ప్రజలతో ముచ్చటిస్తూ ఇస్త్రీ కొట్టులో ఇస్త్రీ చేశారు. హోటల్లో బజ్జీలు వేశారు. టీ కొట్టులో చాయ్ పంచుతూ విభిన్న రకాలుగా ఓటర్లను ఆకర్షించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో ప్రజలు జనసంద్రంలా పాల్గొన్నారు. ఈసందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రో- హులకు పదవులు కట్టబెట్టి ఉద్యమ కారులను దూరం పెట్టారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ పేదలకు అన్యాయం చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గడిలో బానిసలుగా ఉండడం కన్న కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నారు. తాండూరులో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోహిత్ రెడ్డి స్థానిక వనరులు దోచుకుంటున్నారని ద్వజమెత్తారు. తాండూరు ప్రజలకు ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఈ అరాచక పాలన అంతం కావాలంటే ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు. ప్రజా స్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళ అధికార ప్రతినిధి కల్వ సుజాత, రాష్ట్ర నాయకురాలు సునితా సంపత్.. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సస్ రత్నమాల నర్సింలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి. కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, మమత, నాయకులు అబ్దుల్ రవూఫ్, ప్రభాకర్ గౌడ్, సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, మాజీ కౌన్సిలర్లు సోఫియా భేగం. అఫ్గాభేగం. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్. పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి రాము, మహిళ నాయకులు మాధవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!