స్థానిక సమరానికి సమాయత్తం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs

స్థానిక సమరానికి సమాయత్తం..!
– అన్ని స్థానాల్లో పోటికి సన్నద్ధం కావాలి
– పోరులో బరికి 6 వేల మందికి తగ్గొద్దు
– బీజేపీకి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ ఒక్కటే
– చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి
– తాండూరులో జిల్లా స్థాయి బీజేపీ కార్యశాల విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సమరానికి కమల నాథులు, ఆశావాహులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతిలు అన్నారు. శనివారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా స్థాయి కార్యశాల ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ప్రభారీ జే.శ్రీకాంత్, స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నేతలు సమాయత్తం కావాలన్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీకి సన్నద్ధం కావాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు సభ్యులతో పాటు అన్ని పోటీల్లో 6వేల మంది పోటికి సిద్దం కావాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎంపిటీసీ, జెడ్పీటీసీలు విజయం సాధించేలా ముఖ్య నేతలు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.

అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకునేందుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని, బీఆర్ఎస్ ఏమాత్రం కాదని అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను చేస్తోందని విమర్శించారు. ఆ అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు సోషల్ మీడియా వింగ్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో గెలిచి కాషాయా జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి శివరాజ్, పూనమ్ చంద్ లాహోటీ, మాధవరెడ్డి, ఎన్నె ఈశ్వరప్ప, మిట్ట పరమేష్ రెడ్డి, యు.రమేష్ కుమార్, వడ్ల నందు, పెద్దింటి నవీన్ కుమార్, కేపీ రాజు, గాంజుల శాంతుకుమార్. బాలి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పటేల్ విజయ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం. సుదర్శన్ గౌడ్, సాయిరెడ్డి. బొప్పి శ్రీహరి, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..!