మార్మోగిన శివనామ స్మరణ..!
– సాయిపూర్ రామలింగేశ్వరాలంలో వైభవంగా శివ పూజ
– పాల్గొన్న భక్తులు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ భవానీ నగర్ లోని రామలింగేశ్వ దేవాలయంలో శివ నామస్మరణ మార్మోగింది. ఆదివారం కాలనీకి చెందిన వనజ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయంలో శివపూజ నిర్వహించారు. పండితుల ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోచ్చరణల మద్య శివయ్య పడిపూజను కన్నుల పండుగలా జరిపించారు. శివ పూజలతో శివ భక్తుల భజన కీర్తనలు మార్మోగాయి. పూజలో కాలనీ వాసులు సాగర్ గౌడ్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులతో పాటు పట్టణ ప్రముఖులు హాజరై శివున్ని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఇదికూడా చదవండి…

