తాండూరులో లైలా మూవీ యాక్టర్..!
– సినిమా థియేటర్లో మిత్రులతో కలిసి సందడి
– ఈ కమెడియన్ మనోడే అంటూ వెలువెత్తిన అభిమానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీలోని యాక్టర్ తాండూరులో సందడి చేశారు. ఆదివారం పట్టణంలోని శాంత్ మహాల్ థియేటర్లో ప్రదర్శిస్తున్న సినిమాను ఇందులో నటించిన హెచ్ఎంటీ(హన్మంతు) తన మిత్రులతో కలిసి తిలకించారు. ఇంతకీ ఈ యాక్టర్ ఎవరో కాదు.. తన తాండూరు ప్రాంతానికి చెందిన యువకుడే కావడం విశేషం. తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రాంతానికి చెందిన హనుమంతు గత కొన్నేళ్ళుగా సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు. గతంలో కీడా కోలా, నానీ సినిమా సరిపోదా శనివారం సినిమాలో నటించాడు.
తాజాగా విశ్వక్ సేన్ లైలా సినిమాలో అవకాశం వచ్చింది. ఇటీవలే విడుదలైన చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శాంత్ మహల్ థియేటర్లో హెచ్ఎంటీ మిత్రులతో కలిసి సినిమా చూశాడు.. ఈ సందర్భంగా హనుమంతు నటనకు మిత్రులు, తాండూరు పట్టణవాసులు అభినందించారు. భవిష్యత్తులో మంచి కమెడియన్ గా రాణించాలని, తాండూరుకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ యాక్టర్ మనోడే.. అభిమానాన్ని చాటుకున్నారు.
ఇదికూడా చదవండి…

