ఫ్రంట్ వారియర్స్‌ను ఖుషీ చేసిన మార్వాడి యువ‌మంచ్

తాండూరు వికారాబాద్

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఖుషీ చేసిన మార్వాడి యువ‌మంచ్
– జిల్లా ఆసుప‌త్రిలో వైద్య సిబ్బందికి స్వీట్ల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : క‌రోనా స‌మ‌యంలో విశేష సేవ‌లందించిన ఫ్రంట్‌లైన్‌ వారియ‌ర్స్‌లోని వైద్య సిబ్బందిలో తాండూరు మార్వాడి యువమంచ్ స‌భ్యులు దీపావ‌ళి ఖుషీని నింపారు. బుధ‌వారం మంచ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ముంద‌స్తు దీపావ‌ళీలో భాగంగా తాండూరు ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలోని వైద్యులు, వైద్య సిబ్బంది, టెక్నిషీయ‌న్స్, వార్డు బాయ్స్, స్వీప‌ర్స్‌కు స్వీట్ బాక్సుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మార్వాడి యువ‌మంచ్ జాతీయ స‌భ్యులు మ‌న్మోహ‌న్ స‌ర్డా, మంచ్ స‌భ్యులు మాట్లాడుతూ క‌రోనా స‌మయంలో వైద్యులు, వైద్య సిబ్బంది యేడాది పాటు 24 గంట‌ల పాటు సేవ‌లందించ‌డం మ‌రువ‌లేనిద‌ని అభినందించారు. అదేవిధంగా జిల్లా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ వైద్య‌సేవ‌లందిస్తున్న వైద్యుల‌ను, వైద్యుల‌ను గుర్తించి ఆనందం పంచిన మార్వాడి యువ‌మంచ్ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచ్ అధ్య‌క్షులు స‌న్ని అగ్ర‌వాల్, కిష‌న్ గోపాల్ రాఠి, రాష్ట్ర ఉపాధ్య‌క్షులు రోహిత్ అగ్ర‌వాల్, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు శ్రీ‌కాంత్ పండిత్‌, ప‌వ‌న్ సోని, రాజ‌పురోహిత్‌, అభిషేక్ అగ్ర‌వాల్, నిఖిల్ అగ్ర‌వాల్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.