తాండూరులో మ‌రో క‌రోనా కేసు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

తాండూరులో మ‌రో క‌రోనా కేసు
– మ‌ల్కాపూర్ వాసికి పాజిటివ్
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప్రాంతంలో మ‌రో క‌రోనా కేసు న‌మోద‌య్యింది. సోమ‌వారం జిల్లా ఆసుప‌త్రిలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఓ వ్య‌క్తికి పాజిటివ్ న‌మోద‌య్యింది. తాండూరు మండ‌లంలోని మ‌ల్కాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని వైద్య అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే ఈనెల‌లో మొద‌టి రోజు క‌రోనా కేసు న‌మోద‌య్యింది. ప‌ట్ట‌ణంలోని విజ్ఞాన‌పురి కాల‌నీలో క‌రోనా కేసు ఉండ‌గా తాజాగా మండ‌లంలోని మ‌ల్కాపూర్ వాసికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో తాండూరు ప్రాంతంలో అధికారికంగా రెండు కేసులు న‌మ‌ద‌య్యాయి. పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తులు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని వైద్యులు సూచించారు. మ‌రోవైపు తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జిల్లా ఆసుప‌త్రిలో సోమ‌వారం మొత్తం 71 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇందులో 26 మందికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లోనే క‌రోనా కేసు నిర్దార‌ణ అయ్యింది. ఈ సంద‌ర్భంగా వైద్యులు మాట్లాడుతూ క‌రోనాను దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మాస్కులు ధ‌రించి.. భౌతికం దూరం పాటించాల‌ని, శానిటైజ‌ర్ వినియోగించాల‌ని సూచించారు.