ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడాలి
– ఆటో డ్రైవర్లకు దుస్తల పంపిణీ అభినందనీయం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
– ఐవీఎఫ్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ
తాండూరు, ధర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లు తోడ్పాటు అందించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) తెలంగాణ రాష్ట్ర యూత్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు దుస్తుల పంపిణీ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నిజాయితీ పనిచేయాలన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇబ్బందులు కలగకుండా సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తోడ్పాడాలన్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ అందించడం అభినందనీయమని రొంపల్లి సంతోష్ కుమార్ ను అభినందించారు. అదేవిధంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం తమవంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

దీంతో పాటు శాంతి భద్రతల పరిరక్షకు కూడా సహాకారం అందిస్తామన్నారు. ఆటో డ్రైవర్లు కూడా పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెబర్ క్రైం డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి, రూరల్ సీఐ నగేష్, పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డా.జయప్రసాద్, కార్యదర్శి అనిల్ కుమార్, డా.శివకుమార్, పోలీసు శాఖ సిబ్బంది. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

