ఐసీయూకు అనుకూలం..!
– జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుకు కసరత్తు
– నేతలు, అధికారులు దృష్టి సారిస్తే నేరవేరే కల
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న తాండూరులోని జిల్లా ఆసుపత్రి మంచి గుర్తింపు పొందింది. పేదలకు భరోసా వంతమైన సేవలందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నేతలు, అధికారులు అందిస్తున్న సహకారంను మరింత పొడగిస్తే మరిన్ని మెరుగైన వైద్య సేవలను పొందుతారనడంతో సందేహం లేదు. జిల్లా ఆసుపత్రి నుంచి ప్రస్తుతం మాతా శిశు సేవలు వేరుపడింది. ఆసపత్రిలో ప్రతిరోజూ ప్రసూతి సేవలు రికార్డులో స్థాయిలో పెరగడంతో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి అందుబాటులోకి తీసుకవచ్చేందుకు దృష్టిసారించిన ఆశలు పలించాయి. ఇటీవలే ఈ మాతా శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగి కొత్త సంవత్సరం నుంచే మహిళలకు ప్రసూతి సేవలతో పాటు చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.


