ఉయ్యాలో.. ఉయ్యాలా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉయ్యాలో.. ఉయ్యాలా..!
– బతుకమ్మ చీరలతో ఉయ్యాలా
– చిన్నారులకు ఆడవిడుపుగా చీరలు
– విమర్శలకు కారణమైన అధికారుల నిర్లక్ష్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ.. బతుకమ్మా.. ఉయ్యాలో అనేది తెలంగాణ సంస్కృతి పాట.. ఈ పాటలోనే పదాలే తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలు చిన్నారులకు ఉయ్యాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబించేలా బతుకమ్మ చీరలను చిన్నారులు ఆటవిడుపుగా మారాయి.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండగ సందర్భంగా నేతన్నలు నేసిన చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలో మహిళలకు పంపిణీ చేయాల్సిన చీరలు పట్టణంలోని రైతు బజార్‌లోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్లో కుప్పలుగా ప్రత్యక్షమయ్యాయి. గత కొన్ని రోజులుగా అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉండే చిన్నారులు అక్కడే ఉన్న షెడ్లలో ఉయ్యాలలు వేసుకుని ఊగుతున్నారు. షెడ్డులోని ప్రతి రాడ్డుకు చీరలను కట్టి ఆటవిడుపుగా మార్చుకున్నారు. మహిళల వద్దకు చేరాల్సిన చీరలు పేలుకల్లా దర్శనమివ్వడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తుందని స్థానికులు పెదవి విరుపు విమర్శలు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి….

టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ