ఊపిరి పోసిన ఊరికి ఉప‌కారం

తాండూరు రాజకీయం వికారాబాద్

ఊపిరి పోసిన ఊరికి ఉప‌కారం
– ప‌ల్లె రుణం తీర్చుకోవ‌డం నా బాధ్య‌త
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్
– గాజీపూర్‌ ఆంజనేయ దేవాల‌యానికి రూ. 1ల‌క్ష 116ల విరాళం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఊపిరి పోసిన ఊరికి ఉప‌కారం చేయ‌డం నా బాధ్య‌త అని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. గురువారం తన సొంత‌ఊరు పెద్దేముల్ మండ‌లం గాజీపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాల‌య‌ పునర్ నిర్మాణానికి త‌న‌వంతు స‌హాయంగా రూ. 1ల‌క్ష 116ల‌ను విరాళంగా అంద‌జేశారు. గ‌తంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు గ్రామంలోని ఆంజ‌నేయ స్వామి దేవాల‌యం కూలిపోయింది. గ్రామ‌పెద్ద‌లు దేవాల‌య పున‌ర్ నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముర‌ళీకృష్ణ గౌడ్ త‌న‌వంతుగా ఆర్థిక సాయం విరాళంగా అంద‌జేశారు. ఈ సందర్భంగా ముర‌ళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పుట్టి పెరిగి సొంతఊరుకు తోచిన సాయం అందించే బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. ప‌ల్లె రుణం తీర్చుకోవ‌డంలో భాగంగా ఆంజ‌నేయ స్వామి దేవాల‌య పున‌ర్ నిర్మాణానికి తోడ్పాటు అందించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అదేవిధంగా గాజీపూర్ గ్రామ‌ అభివృద్ధికి అండ‌గా నిలుస్తాన‌ని, ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసు కొస్తే పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.

అనంత‌రం గ్రామ‌స్తులు విరాళం అందించిన ముర‌ళీకృష్ణ గౌడ్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరప్ప, రవికుమార్, నరసింహారెడ్డి, నసీర్, నాగు పటేల్, సునీల్ గౌడ్, నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, బైబిల్ , సంగమేశ్వర్, వెంకటయ్య మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.