కోల్కొండ సంతోష్‌కు ఘన సన్మానం
– ఏఐసీసీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు
– అభినందనలు తెలిపిన కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా శిక్షణ, సందేశ్ విభాగాల్లో కీలక బాధ్యతలు చేపట్టబోతున్న వికారాబాద్ జిల్లా వాసి కోల్కొండ సంతోష్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కావలి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ వేదికల ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోల్కొండ సంతోష్ అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం వికారాబాద్ జిల్లాకు గర్వకారణమన్నారు.

విద్యార్థి నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం ఏఐసీసీ స్థాయికి చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ రాజకీయ ప్రస్థానంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత్ రెడ్డి, అంతరం శ్రీనివాస్, వీరేశం ఉన్నారు.


