ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే…!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే…!
– అరచేతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌
– ఆన్‌లైన్ ప్రక్రియతో ఈజీగా చేసుకోవచ్చు
దర్శిని డెస్క్ : వాహనాలను నడిపేందుకు ప్రధాన వాటిలో డ్రైవింగ్ లెసెన్స్‌ ఒకటి. ఏ వాహనం నడపాలన్నా ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాహనదారులకు ఆర్టీఏ శాఖ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేస్తారు. జారీ చేసే ముందు కొంతకాలం గడువుతో మంజూరు చేస్తారు. గడువు తీరిన తరువాత రెన్యువల్ చేసుకోవాలంటే.. మళ్లీ ఆర్టీఏ కార్యాలయానికి పరుగులు తీయాల్సిందే. అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యూవల్ చేసుకోవచ్చు. కంప్యూటర్, మోబైల్ ఫోన్‌ ఉంటే.. రెన్యూవల్ చేసుకునే ప్రక్రియ తెలిస్తే చాలు.. ఈజీగా చేసుకోవచ్చు.

ఈ విధంగా రెన్యూవల్ చేసుకోండి…
మొదట రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి డ్రైవింగ్‌ లైసెన్సు సంబంధిత సేవల్లో డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యూవల్‌పై క్లిక్‌ చేయండి. పేజీ లోడ్‌ అయినపుడు స్లాట్ బుకింగ్‌ కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.
ఇప్పుడు రెన్యువల్‌ ఆఫ్‌ లైసెన్సును ఎంచుకుని గో పై క్లిక్‌ చేయాలి. తర్వాత డ్రైవింగ్‌ లైసెన్సు నెంబరు, జారీ చేసిన ఆర్టీఏ కార్యాలయం, పుట్టిన తేదీ, చరవాణి నంబరు, క్యాప్చా వంటి వివరాలను నమోదు చేయాలి. రిక్వెస్ట్‌ ఓటీపీపై నొక్కితె మీ చరవాణికి ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్‌ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్‌పై క్లిక్‌ చేస్తే మన వివరాలు కనిపిస్తాయి. వీటిని పరిశీలించాకా కన్‌ఫాంపై క్లిక్‌ చేసి, సేవ్‌ను నొక్కితే మన వివరాలు సేవ్‌ అవుతాయి.

వచ్చిన విండోలో స్లాట్ కోసం మనకు నచ్చిన తేదీ, సమయాలను ఎంచుకుని నెక్ట్స్‌పై నొక్కాలి. ఇపుడు మనం చెల్లించాల్సిన రుసుం మొత్తాన్ని పరిశీలించి పే నౌపై క్లిక్‌చేస్తే వచ్చిన పేమెంట్ ఆప్షన్లలో మనకు అనువైన దానిని ఎంచుకుని పే చేస్తే స్లాట్ బుక్‌ అవుతుంది. మెడికల్‌ ఫిట్నెస్‌ సర్టిఫికెట్ వస్తుంది. వీటిని ప్రింట్ తీసుకోవాలి. మెడికల్‌ ఫిట్నెస్‌ సర్టిఫికెట్పై వైద్యాధికారితో సంతకం చేయించి, ఆధార్, ఒరిజనల్‌ డ్రైవింగ్‌ లైసెన్సును స్లాట్ బుక్‌ అయిన రోజున ఆర్టీఏ కార్యాలయంలో అందజేస్తే కొద్దిరోజుల్లోనే రెన్యూవల్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్సు వస్తుంది.

ఇది కూడా చదవండి….

ఏం గుండెలు సామీ.. మీవీ..!