ఏం గుండెలు సామీ.. మీవీ..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ఏం గుండెలు సామీ.. మీవీ..!
– రక్త నిల్వల కోసం ఆసుపత్రి సిబ్బంది రక్తదానం
– ఆపదకు ముందే అప్రమత్తపు చొరవ
– అభినందించిన సూపరిండెంట్ డా. రవిశంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపద రాక ముందే ఆదుకునే మనసు అందరకి ఉండదు. అలాంటి సేవా చేయాలంటే గుండే ధైర్యం.. మానవత్వం నిండి ఉండాలి. దీనికి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం సిబ్బంది ఉదహరణగా నిలిచారు. జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో గురువారం రక్తపు నిల్వలు నిండుకున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రమాదానికి గురైతే… ఎవరికైనా అవసరం ఏర్పడితే దాతల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రక్తనిధి కేంద్రంలో పనిచేస్తన్న సిబ్బంది రక్తదానంకు ముందుకు వచ్చారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ ఆదేశాల మేరకు రక్తనిధి కేంద్రంలో పనిచేసే సిబ్బంది ప్రవీణ్, బీరప్ప, రవి, దశరథ్, విజయ్, శివ రాథోడ్, అనంతప్ప, అంజప్ప, రవీందర్, అస్లామోద్దీన్, మంజుల, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు రక్తదానం చేశారు.

రక్తపు కొరత ఏర్పడి ఎవ్వరికి ఇబ్బంది రాకుండా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన సిబ్బందిని ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్ అభినందించారు. రక్తదానం మహాదానం అని, రక్తదానం చేసేందుకు యువత మందుకు రావాలని అన్నారు. మరోవైపు రక్తదానం చేసిన సిబ్బంది మాట్లాడుతూ సామాజిక సృహతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి….

భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..!