ఫాస్ట్‌స్టాగ్‌లో కొత్త ప్లాన్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఫాస్ట్‌స్టాగ్‌లో కొత్త ప్లాన్..!
– ఆగస్టు 15నుంచి అమలు
– నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
– వాహనదారులకు మరింత మేలు
దర్శిసి డెస్క్ : ఫాస్ట్‌స్టాగ్ వినియోగ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్లాన్‌ తీసుకరాబోతోంది. వచ్చే ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్న పథకంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక విషయాలను ప్రకటించారు.

ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుని యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే దేశంలో ఎక్కడైనా తిరిగే అవకాశం కల్పిస్తూ కొత్త విధానం తీసుకువచ్చింది కేంద్రం. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్‌- కమర్షియల్‌ ప్రైవేటు వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్‌ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాజ్‌మార్గ్‌ యాప్‌తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో ఈ లింక్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. వార్షిక పాస్‌ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ పాస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని, వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని గడ్కరీ అన్నారు.

అమలు ప్రయోజనాలు ఇలా..
ఒకేసారి రీఛార్జ్ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రద్దీని తగ్గించడం టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గించడం ద్వారా, లక్షలాది మంది ప్రైవేట్ వాహన వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా వార్షిక పాస్ ఉపయోగపడనుంది. ఒక్కో టోల్‌ప్లాజాను దాటడాన్ని ఒక్కో ట్రిప్‌గా పేర్కొంటారు. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విజయవాడ ప్రయాణించేటప్పుడు మధ్యలో నాలుగు టోల్‌గేట్లు దాటాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొస్తే ఎనిమిది ట్రిప్పులుగా పరిగణిస్తారు. ఆ లెక్కన పాస్‌ తీసుకుంటే ప్రతి టోల్‌ గేటు వద్ద సగటున రూ.15 చొప్పున చెల్లించినట్లు అవుతుంది.

ఇదికూడ చదవండి…

మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం