సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల
– సర్టిఫికెట్ల రెన్యూవల్ కోసం నేటి నుంచి స్లాట్ బుకింగ్స్
– ప్రకటించిన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో మే నెలకు సంబంధించిన సదరం/యూడీఐడీ క్యాంపుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ క్యాంపులు జరుగుతాయని వెల్లడించారు.

అంగవైక్యలం కోసం 13, 16, 21తేదిలలో క్యాంపులు, చెవుడు, మూగ కోసం 23, అంధులు, తక్కువ చూపు బాధితుల కోసం 27న, బుద్దమాంధ్యం, మానసిక వికలాంగత్వ బాధితుల కోసం 29న క్యాంపులు జరుగుతాయన్నారు. ఈ క్యాంపుల ద్వారా రెన్యూవల్ కోసం అవకాశం ఉంటుందని, ఈనెల 9(నేటి), 12వ తేదిలలో స్లాట్ బుక్‌ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకుని ఉంటే పైన తెలిపిన తేదిలలో క్యాంపులకు హాజరుకావాలని సూచించారు.

వాటర్‌ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక

ఇదికూడా చదవండి…

డబ్బుల్లేకున్నా రైల్లో వెళ్లొచ్చు..!