కారు గుర్తుకే ఓటేయ్యాలే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కారు గుర్తుకే ఓటేయ్యాలే..!
– తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి ప్రమోదిని రెడ్డి
– పట్టణంలోని వార్డుల్లో జోరుగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు పొందిన వారంతా కారు గుర్తుకే ఓటేయాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే తల్లి, వికారాబాద్‌ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి కోరారు. చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపుకోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తల్లి, వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి కృషి చేస్తున్నారు.

సోమవారం తాండూరు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రమోదిని రెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారీలతో కలిసి ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ ఆరు గ్యారెంటీలతో మోసం చేసిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం అందరు కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పట్టణంలోని ప్రమోదిని రెడ్డితో పాటు కౌన్సిలర్లు భద్రేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళ కన్వినర్ శకుంతల, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సింధూజగౌడ్, సంగీత ఠాకూర్, ఎర్రం వసంత, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అనురాధ, చంటియాదవ్, ఎర్రం శ్రీధర్, గుండప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్‌ బహిరంగ సభ వాయిదా..!