ఆయుష్షు.. వందనం..!
– వారి కోసమే అద్భుతమైన స్కీం
– రూ. 5లక్షల వరకు ఉచిత వైద్యం
– ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు
దర్శిని డెస్క్ : దేశంలోని పేదల కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ, ఆరోగ్య పథకాలను అమలు చేస్తోంది. చిన్న పిల్లలు, యువకులు, మహిళలు, పేద, మద్య తరగతి అనే తేడా లేకుండా అర్హులైన వారందరికి మేలు చేస్తోంది. అయితే లేవలేని వయస్సులో ఉన్న వృద్దుల కోసం కూడా పథకాన్ని అమలు చేస్తోంది. వృద్ధులు అనారోగ్యానికి గురైతే లక్షల్లో వైద్యానికి ఖర్చు చేయలేని నిరుపేదలు ఉంటారు. ఈ నేపథ్యంలో వృద్ధుల ఆరోగ్య భరోసాకు కేంద్రం ప్రభుత్వ ప్రధాన మంత్రి వయో వందన స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ పథకంలో ఎలాంటి సౌకర్యాలు పొందవచ్చో తెలుకోండి..

దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జాతీయ ఆరోగ్య ప్రదాత (NHA) నిర్వహిస్తుంది. ఈ పథకంలో 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి, సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా వార్షిక నగదు రహిత ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు అందిస్తుంది. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందడం ద్వారా ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందవచ్చు. దీని కింద లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందవచ్చు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
వయో వందన కార్డు కోసం రిజిస్ట్రేషన్ డిజిటల్, యూజర్ ఫ్రెండ్లీ, ఆయుష్మాన్ భారత్ యాప్ ఉపయోగించి నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ ఆధారిత ఈ-కెవైసి తప్పనిసరి. ఆధార్ కార్డు మాత్రమే అవసరమైన పత్రం. ఆధార్‌లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఇస్తే, మరుసటి సంవత్సరం జనవరి 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణిస్తారు. అర్హులు ముందుగా ఆయుష్మాన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. లబ్ధిదారుడిగా లేదా ఆపరేటర్‌గా లాగిన్ అవ్వండి. క్యాప్చా, మొబైల్ నంబర్ నమోదు చేసి ప్రామాణీకరణను పూర్తి చేయండి. OTP, captcha నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వండి. రాష్ట్రం, ఆధార్ కార్డ్, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి. లబ్ధిదారుడు జాబితాలో లేకుంటే e-KYC ప్రక్రియను పూర్తి చేయండి. డిక్లరేషన్ నింపి అవసరమైన వివరాలను నమోదు చేయండి. కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా జోడించండి. అన్ని వివరాలను పూరించిన తర్వాత, దరఖాస్తును సమర్పించండి.
e-KYC విజయవంతమైతే, మీరు ఆమోదించబడతారు. అలాగే మీ ఆయుష్మాన్ వయ వందన కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రధాన ప్రయోజనాలు ఇవే..
సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తుంది. 27 స్పెషాలిటీ విభాగాలలో 1,961 వైద్య విధానాలను కవర్ చేస్తుంది. ముందుగా ఉన్న అన్ని వ్యాధులు కూడా మొదటి రోజు నుండే కవర్ అవుతాయి. 13,352 ప్రైవేట్ ఆసుపత్రులతో సహా 30,000 కంటే ఎక్కువ ప్యానెల్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స. ప్రత్యేక వైద్య విధానాలలో హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్, మొత్తం మోకాలి, తుంటి మార్పిడి, కార్డియాలజీ చికిత్సలు (PTCA, పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్), స్ట్రోక్, క్యాన్సర్ సంరక్షణ, ఆర్థోపెడిక్ సర్జరీ ఉన్నాయి.

ఇదికూడా చదవండి..


