చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
– చెంగోల్లో శివాజీ జయంతి వేడుకలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చత్రపతి శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు మండలం చెంగోల్ గ్రామ నాయకులు పేర్కొన్నారు. శనివారం గ్రామంలోని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో హిందు సామ్రాట్ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ మల్లీశ్వరి, ఉపసర్పంచ్ లక్ష్మణ్, వివేకానంద యువజన సంఘం సభ్యులు శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ హిందూ సమాజంకోసం శివాజీ చేసిన సేవలు ఎనలేనివని, యువత శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు రాము, విజయ్, హన్మయ, నారాయణరెడ్డి, బిచప్ప, లక్ష్మీకాంత్ రెడ్డి, సురేష్, కృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.

