గణనాథుల సేవలో బీఎస్ఆర్..!
– గంజ్ వినాయకున్ని దర్శించుకున్న శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించిన అసోసియేషన్ సమితి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్టించిన గణనాథుల సేవలో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) తరించారు.

పట్టణంలోని నెహ్రు గంజ్‌లో దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా ఉత్సవాలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. మూడో రోజు శుక్రవారం రాత్రి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అసోసియేషన్ గణనాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గంజ్ వ్యాపారులకు మంచి జరగాలని, అందరు వృద్ధిలోకి రావాలని వినాయకున్ని వేడుకున్నారు. అనంతరం అసోసియేషన్ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, మాజీ అధ్యక్షులు కట్కం వీరేందర్, బంటారం రవి శంకర్, ఆదిత్య, సంగమేశ్వర్, బంటు మల్లప్ప, బంటు వేణు, అసోసియేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

