భద్రేశ్వరుని కృపతో వ్యాపారులకు తోడ్పాటు

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వరుని కృపతో వ్యాపారులకు తోడ్పాటు
– దేవాలయ షాపింగ్ నిర్మాణంతో చేయూత
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : భద్రేశ్వర స్వామి కృపతో షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు తోడ్పాటు అందబోతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయ సమీపంలో దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా మంచి షాపింగ్ కాంప్లెక్స్ లేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని, కొత్త కాంప్లెక్స్ నిర్మాణంతో వారి కల నెరవేరబోతుందని అన్నారు. భద్రేశ్వర స్వామి కృపతో వ్యాపారులకు తోడ్పాటు అందుతుందని అన్నారు. అర్హులైన వారికే దుకాణాలు కేటాయించేలా చూడాలని ఆదె శించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి చొరవచూపిన రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ ను అభినందించారు. అంతకుముందు దేవాలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భద్రేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

రైల్వే లైన్‌కు సహాకారం
మరోవైపు తాండూరు నుంచి చించొల్లి వరకు కొత్త రైల్వే ఏర్పాటు కాబోతుందని తెలిసినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం పూర్తి సహాకారం అందిస్తామని అన్నారు. ఇందుకు కృషి చేసిన కర్ణాటక ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఆ స్థలం మాకు పవిత్రం..!