హజ్ యాత్రికులకు తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే, పైలట్ రోహిత్ రెడ్డి
– 30 ముస్లిం కుటుంబాలకు తోఫా అందించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరులు పవిత్రంగా చేపట్టే హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసేందుకు తమవంతు తోడ్పాటు అందించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ హాల్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముస్లిం సోదరులతో సమావేశం అయ్యారు. పట్టణానికి చెందిన 30 ముస్లిం కుటుంబాలు ఈ నెలలో హజ్ యాత్ర కు బయల్దేరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయా కుటుంబాలకి బ్యాగుల రూపంలో హజ్ తొఫాను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం.. అల్లాను ప్రార్థించాలన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి తమవంతు తోడ్పాటు ఎల్లప్పుడు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ కమల్ అక్తర్, అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


