ఆ స్థలం మాకు పవిత్రం..!
– మటన్ షాపు ఏర్పాటుపై చర్యలు తీసుకోండి
– కమీషనర్‌కు హిందూ ఐక్య వేదిక వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోన్న మటన్ షాపు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని తాండూరు హిందూ ఐక్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వినాయక చౌరస్తాలో గత 41 ఏండ్లుగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రజలు పవిత్ర స్థలంగా భావిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు, ప్రజలతో నిత్యం రద్దీగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రదేశంలో కొందరు మటన్ షాపు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని, దాని ఏర్పాటును రద్దు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక సభ్యులు రజనీకాంత్, తర్లపల్లి భాను, పర్యాద రామకృష్ణ, మహేష్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…