ఘ‌నంగా దీపా న‌ర్సింలు జ‌న్మ‌దిన వేడుక‌లు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘ‌నంగా దీపా న‌ర్సింలు జ‌న్మ‌దిన వేడుక‌లు
– శుభాకాంక్ష‌లు తెలిపిన నాయకులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. శుక్ర‌వారం సాయిపూర్‌లోన్ వైస్ చైర్ ప‌ర్స‌న్ నివాసంలో టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు చంటియాద‌వ్‌, సంజీవ‌రావుల ఆధ్వ‌ర్యంలో దీపా న‌ర్సింలు జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకున్నారు. జ‌న్మ‌దినాన్ని
పుర‌స్క‌రించుకుని నాయ‌కులు దీపా న‌ర్సింలుకు పుష్ప‌గుచ్చం అందించి శాలువాతో స‌న్మానించారు. అనంత‌రం ఆమె చేతుల మీదుగా కేక్‌ను క‌ట్ చేయించి తినిపించారు. అనంత‌రం ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో దీపా న‌ర్సింలు మ‌రిన్ని జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను సంతోషంగా జ‌రుపుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల సంక్షేమానికి ఆమె చేస్తున్న సేవ‌లు గుర్తుండి పోతాయన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు రాజ‌న్‌గౌడ్, విజ‌య్ కుమార్, గుండ‌ప్ప‌, ఈర్షాద్, ర‌వి, యోగానంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.