పేదలకు అండగా సీఎం సహాయ నిధి
– తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన హాజి అనే వ్యక్తికి మంజూరైన రూ. 1లక్ష సీఎం సహాయ నిధి ఎల్ఓసీని ఆదివారం వైస్ చైర్ దీపా నర్సింలు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా దీపా నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకంతో ఎంతో మంది తమ ప్రాణాలను కాపాడుతోందన్నారు. పేదలకు అండగా నిలుస్తోన్న సీఎం సహాయ నిధి పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువనాయకులు సంతోష్ గౌడ్, సంజీవ్ రావు, గుండప్ప, ఇర్షద్, చంటి యాదవ్, ఇంతియాజ్ బాబా, మొయిజ్ ఖాన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
