రేపు నేషనల్ హైవే రోడ్డువిషయంపై మీటింగ్
– తాండూరు మండల భూనిర్వహసితులకు ఆహ్వానం
– ప్రకటించిన తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మీదుగా వెళుతున్న నేషనల్ హైవే(ఎన్హెచ్) 167 రోడ్డుపై సమావేశం ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి తాండూరు మండలం మీదుగా చించొల్లి వైపు జాతీయ రహదారి 167 వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ మార్గంలో ఉన్న తాండూరు మండలం చెన్ష్ పూర్, గౌతాపూర్, కొత్లాపూర్, కోటబాప్పల్లి, ఐనెల్లి, రాంపూర్, జినుగుర్తి, మిట్టబాస్పల్లి, అల్లాపూర్ గ్రామాల్లోని రైతుల భూముల నుంచి జాతీయ రహదారి మార్గం వెళుతోంది. ఇందులో భాగంగా రేపు గురువారం ఉదయం 10-30 గంటలకు తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే రైతులు భూమి పాస్ బుక్కు, ఆధార్ కార్డు జీరాక్స్, బ్యాంకు పాసు పుస్తకాలను వెంట తీసుకరావాలని ఆర్టీఓ శ్రీనివాస్ రావు సూచించారు.
ఇది కూడా చదవండి…

