దేశానికి సేవలు అందించడమే ఆర్బీఓఎల్ లక్ష్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

దేశానికి సేవలు అందించడమే ఆర్బీఓఎల్ లక్ష్యం
– భవిష్యత్తులో విమానాలకు ఇంధనం సరఫరా ధ్యేయం
– 3 కోట్ల లీటర్ల ఇథనాల్, ఈఎన్ఏ కోసం కేంద్రంతో ఒప్పందం
– 20శాతం ఇథనాల్ బ్లెండింగ్లో ఆర్బీఓఎల్ భాగస్వామ్యం
– రూ.500ల కోట్ల టర్నోవర్ కు టార్గెట్
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశానికి, దేశ సంరక్షణకు సేవలను అందించడమే యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ (రాడికల్ బయోఆర్గానిక్ లిమిటెడ్) లక్ష్యమని సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

2010లో 60లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించి ఇప్పటి వరకు 2లక్షల లీటర్ల ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2లక్షల లీటర్లలో 1 లక్ష 10వేలు ఇథనాట్, 90వేల లీటర్ల ఈఎసీ తయారు చేస్తున్నామని చెప్పారు. ఈఎన్ఏ ఫార్మా, లిక్కర్ కంపెనీలకు సరఫరా చేస్తుండగా ఇథనాల్ ను ఓఎంసీ, ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ కంపెనీలకు విక్రయించడం జరుగుతుందన్నారు. దీంతోపాటు కేంద్రం తీసుకవచ్చిన పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ బ్లెండింగ్ విధానానికి 3కోట్ల లీటర్ల ఆర్డర్ తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇందుకోసం ఇథనాల్ లక్ష్యానికి మించి తయారు చేస్తున్నామని తెలిపారు. ఇథనాల్ 20శాతం బ్లెండింగ్ అందిస్తున్న 60 కంపెనీలలో ఆర్బీఓఎల్ కూడా భాగస్వామ్యం కావడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు.

అదేవిధంగా ప్రతి రోజూ 40-80 టన్నులు సీఓటు, 40టన్నుల డైరీ, ఫిష్ ఫీడ్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారతదేశం మూడో స్థానంలో ఉందని, ఈ కారణంగా ఏర్పడిన విదేశీ మాధక ద్రవ్యాన్ని ఆధా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. భవిష్యత్తులో కంపెనీలను విస్తరించడంతో పాటు విమానాలకు ఇంధనం అందించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూరు నుంచి ఆర్బీఎల్ తరుపున దేశ రక్షణ నిధికి ప్రతి నెల రూ.2లక్షలు అందించడం జరుగుతుందన్నారు. ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ పరిసర గ్రామాలు జక్కెపల్లి, బెన్నూర్ తదితర గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కంపెనీలో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రతినెల రూ. 60లక్షలు వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ యేడాది రూ.500ల కోట్ల టర్నోవర్ సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు.

ఇదికూడా చదవండి…

జంతువు మెదడుతో పాఠం..!