మ‌హేంద్రున్ని మెచ్చిన ఉద్దండాపూర్

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

మ‌హేంద్రున్ని మెచ్చిన ఉద్దండాపూర్
– ఎమ్మెల్సీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన గ్రామ‌స్తులు
– మైస‌మ్మ తాండా వ‌ర‌కు బీటీ రోడ్డు నిర్మాణం
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని తాండూరు మండ‌లం ఉద్దండాపూర్ గ్రామజ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది. ఉద్దండాపూర్ నుంచి మైస‌మ్మ తాండా వ‌ర‌కు ఏండ్లుగా ప‌రిష్కారం కాని బీటీ రోడ్డు నిర్మాణంను చేప‌ట్ట‌డం ప‌ట్ల గ్రామ‌స్తులు మ‌హేంద్రునికి జైజై ద్వానాల‌తో మెచ్చుకున్నారు. తాండూరు మండ‌లం ఉద్దండాపూర్ గ్రామానికి మంజూరైన బీటీ రోడ్డు ప‌నులు ఇటీవ‌లే పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఆదివారం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి గ్రామాన్ని సంద‌ర్శించారు. గ్రామంలో పూర్త‌యిన రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని గ్రామ స‌ర్పచులు ద‌శ‌ర‌థ్, కౌస‌ల్య త‌దిత‌రులు క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌లకు ఇచ్చిన హామి మేర‌కు బీటీ రోడ్డు వేయించ‌డం జ‌రిగింద‌న్నారు. గ్రామాల అభివృద్ధికి త‌మ‌వంతు స‌హాకారం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తాండూరు మార్కెట్ క‌మిటి మాజ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్, స‌ర్పంచ్ మేఘ‌నాథ్ గౌడ్, నాయ‌కులు కేశ‌వ‌రావు, గ‌డ్డ‌లి ర‌వీంద‌ర్, న‌ర్సింలు త‌దిత‌రులు ఉన్నారు.