మనోహరన్న మానవత్వం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మనోహరన్న మానవత్వం..!
– మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
– ఒక్కో కుటుంబానికి రూ. 10వేల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మానవతం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన సుమారు 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రమాదంలో మరణించిన ముగ్గురు అక్కా చెల్లెళ్ల కుటుంబానికి, మరికొందరి మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రూ.10వేల చొప్పున ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
kvcs
తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా బాధిత కుటుంబాలకు అందజేశారు. మరోవైపు ముగ్గురు అక్కా చెల్లెళ్ల కుటుంబానికి మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి తన సొంతంగా రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్డె శ్రీనివాస్, పాండుగౌడ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తండ్రికి టాటా.. చెప్పి..!