అంగన్‌వాడిలో కొలువుల జాతర ..!

కెరీర్ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అంగన్‌వాడిలో కొలువుల జాతర ..!
– పోస్టుల భర్తికి త్వరలో నోటిఫికేషన్
– టీచర్లు, ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడి కేంద్రాల్లో కొలువుల జాతర రాబోతోంది. అన్ని కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టులను భర్తి చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. తెలంగాణలోని అంగన్​వాడీ కేంద్రాల్లో దాదాపు 20 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రిజైన్​ చేయడం, ఇప్పటికే పని చేస్తున్న వారికి సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. 65 ఏళ్లు నిండిన టీచర్లు, సహాయకులు ఉద్యోగ విరమణ చేశారు. వారి సంఖ్య దాదాపు 7 వేలుగా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ పరిస్థితిని అధిగమించేందుకు అంగన్​వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయిచింది. మొత్తం 14,236 పోస్టులకు శిశు సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. కానీ నోటిఫికేషన్ల జారీకి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.

రెండు రోజుల క్రితం దీనిపై సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం ఖాళీల్లో 6,399 టీచర్​, 7,837 హెల్పర్​ పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి కేంద్రాల్లో స్థానిక ఆదివాసీలు, గిరిజనుల్ని నియమించి, వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలని సర్కార్​ భావిస్తోంది. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉండేవి. ఈ రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏవిధంగా చేపడుతున్నారో అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని శిశు సంక్షేమశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఆదేశించారు. అధ్యయన నివేదిక అనంతరం ఉద్యోగ ప్రకటనలపై ముందుకు వెళ్లనుంది.

ఇదికూడా చదవండి…

ఓపెన్ చాన్స్..!