రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం

తాండూరు రాజకీయం వికారాబాద్


రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
– ఎన్ని గంటలు కరెంట్ నిలుస్తుందంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. తాండూరు మండలంలోని కందనెల్లితో పాటు పట్టణ పరిధిలోని రాజీవీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నేషనల్ గార్డెన్, గంగోత్రి స్కూల్, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాలలో రేపు బుధవారం ఉదయం 10-3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండబోదని చెప్పారు.

వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ రోడ్డు 11 కేవి, ఖాంజాపూర్ 11 కేవీ ఫీడర్ మార్గాలలో చెట్లు తొలగింపు చర్యల్లో భాగంగా విద్యుత్ అంతరాయం కలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు విద్యుత్ వి నియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

‘హస్తం’లో అనిశ్చితి..!