మెగా సక్సెస్..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మెగా సక్సెస్..!
– వైద్య శిబిరానికి స్పందన
– 380 మందికి పరీక్షలు
– 60 మందికి అపరేషన్ల గుర్తింపు
– డీప్యూటీ డీఎంఅండ్ హెచ్ డా.రవీందర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్ లోని యూపీహెచ్సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం సూపర్ సక్సెస్ అయ్యింది.
kvcs
సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచనలతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ డా. రవిందర్ యాదవ్ పర్యవేక్షణలో ఆరోగ్య కేంద్రంలో కళ్లు, చెవి, గొంతు, ముక్కుతో పాటు మానసిక సమస్యలపై వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం కొనసాగింది. ఇందిరానగర్ తో పాటు పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్య శిబిరానికి తరలివచ్చారు. ఇందులో 108 మందికి చెవి, 152 మందికి కంటి, 11 మంది మానసిక సమస్యలు, మరో 110 మంది పలు రకాల అనారోగ్య సమస్యలతో మొత్తం 380 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ డా.రవీందర్ యాదవ్ తెలిపారు. ఇందులో 62 మందికి పలు ఆపరేషన్లు అవసరమని గుర్తించడం జరిగిందన్నారు. వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందన్నారు.

వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డా.గిరిధర్, అక్షయ్, అఖిల్ ఖాన్, రాధ, రాజేశ్వరీ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

బంటు మల్లప్ప ఇంట్లో నూతన సందడి