రాజకీయం, నామినేట్ పదవుల్లో ప్రాధాన్యం
– స్వర్ణకారుల సంఘం అభివృద్ధికి తోడ్పాటు
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాజకీయం, నామినేటేడ్ పదవుల్లో స్వర్ణకారులకు ప్రాధాన్యమివ్వడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని చీరల బజార్‌లో స్వర్ణకారణ సంఘం భవన ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారులకు రాజకీయం, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్వర్ణకార సంఘ భవన విస్తరణతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహాకారం అందిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, వార్డు కౌన్సిలర్ సోమశేఖర్, టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటేష్ చారి,
రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు గద్దె శ్రీనివాస్ చారి, టీయూడబ్ల్యూజే జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు కందనెల్లి శ్రీనివాస్ చారి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
