సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– లబ్దిదారులకు ఎల్‌ఓసీల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.
kvcs
అనారోగ్యానికి గురైన తాండూరు పట్టణానికి చెందిన ఫిరోజ్ హుస్సేన్ కు రూ.2లక్షల 50వేలు, శారద బాయికి రూ.2లక్షల 50వేలను ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరు చేసింది. గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారుల కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మంది పేదల ఆరోగ్యాలకు భరోసా కల్పిస్తోందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని పేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

పారదర్శకంగా సేవలందించండి..!