తాండూరు యువతకు బంపర్ ఆఫర్
– పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు
– ఉద్యోగాలు, అర్హులు ఎవరంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా రాజకీయాలలో పట్నం మహేందర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల గురించి అందరికి తెలిసిందే. అలాంటి కుటుంబం నుంచి రాజకీయాలే కాదు సేవా, యువతకు తోడ్పాటు అందించే కార్యక్రమాలు కూడ ఉంటాయి. ఇందులో భాగంగానే పట్నం మహేందర్ రెడ్డి సునీతారెడ్డిల వారసుడు పట్నం రినీష్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రాంత యువతకు బంపర్ ఆఫర్ తీసుకవచ్చారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా ఉద్యోగవకాశాలను కల్పించబోతున్నారు. హైదరాబాద్‌లోని రైన్ అకాడమి అనే కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. పదవ తరగతితో పాటు ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఉద్యోగాలకు అర్హులని పట్నం రినీష్ రెడ్డి టీం సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీ, నాన్ ఐటీ, కన్‌స్ట్రక్షన్ సైడ్‌లో కూడ ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. దీంతో పాటు ఇతర విభాగాలలో 15 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి అందులో నైపుణ్యం పొందిన వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరగుతుందని తెలిపారు. ఆసక్తిగల అర్హులైన యువత రిజ్యూమ్‌తో పూర్తి వివరాల కోసం తాండూరులోని మహేందర్ రెడ్డి నివాసంలో సంప్రదించాలని సూచించారు.

