మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌
– కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ
– సికింద్రాబాద్‌ – వాడీ మార్గంలో ప్రాజెక్టు
– పనుల గడువు, ప్రణాళికలు సిద్దం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వే శాఖ వేల కోట్లతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా కచ్, గుజరాత్‌ రాష్ట్రంతో పాటు కర్ణాటక, తెలంగాణ, బీహార్, ఆస్సాం రాష్ట్రాల్లోని మూడు కీలక రైల్వే మార్గాల విస్తరణ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులు PM-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌పై ఆధారపడి, మల్టీ-మోడ్ కనెక్టివిటీ, లాజిస్టిక్ సామర్థ్యం పెంపు, సమగ్ర ప్రణాళిక, స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్లపై దృష్టి పెట్టారు.
kvcs

మల్టీ-ట్రాకింగ్ రైలు ప్రాజెక్ట్‌లలో 173 కిలోమీటర్ల సికింద్రాబాద్ (సనత్‌నగర్) – వాడీ రైలు మార్గం, 5 సంవత్సరాల్లో రూ. 5,012 కోట్లు పెట్టుబడితో పూర్తి అవుతుంది. మరొక ప్రాజెక్ట్ 53 కిలోమీటర్ల భగల్పూర్ – జమల్పూర్ 3వ లైన్ బీహార్‌లో, మూడు సంవత్సరాల్లో రూ. 1,156 కోట్లు పెట్టుబడితో పూర్తి చేస్తారు. మూడవ ప్రాజెక్ట్ 194 కిలోమీటర్ల ఫుర్కాటింగ్ – న్యూ తిన్సుకియా రైలు మార్గం డబ్లింగ్, నాలుగు సంవత్సరాల్లో రూ. 3,634 కోట్లు ఖర్చుతో పూర్తి అవుతుంది.

ఈ ప్రాజెక్టులు సిమెంట్, క్లోంకర్, ఫ్లయ్‌అష్, ఇస్పీతి, కంటైనర్లు, రసాయనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి సరుకు రవాణాకు అత్యవసరం. కొత్త లైన్ సామర్థ్యం ద్వారా సుమారు 68 MTPA (మిలియన్లు టన్నులు సంవత్సరానికి) అదనపు ఫ్రైట్ ట్రాఫిక్ వస్తుంది.

ఈ నాలుగు ప్రాజెక్టులు గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, బీహార్, ఆస్సాం రాష్ట్రాల 13 జిల్లాలను కవర్ చేస్తూ, భారత రైల్వే నెట్‌వర్క్‌లో సుమారు 565 కిలోమీటర్ల పొడవు జోడిస్తాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల తెలంగాణకు కూడా చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. రైల్వే లైన్ పొడిగింపు లేదా విస్తరణ వల్ల ఇతర ట్రైన్స్‌కు కూడా బెనిఫిట్ ఉంటుంది. సరుకు రవాణా సులభంగానే చేసుకోవచ్చు. మరింత సరుకు రవాణా సాధ్యం అవుతుంది.

ఇదికూడా చదవండి…

పప్పు చేస్తుండగా పేలిన ఫ్రెషర్ కుక్కర్.!