అభివృద్ధి లేదు అంతా అవినితే..!
– ఆర్డీఓపై చట్టం అస్ర్తాలో పోరుడుతాం
– అధికారులు, ప్రతిపక్షాలతో కుమ్మక్కైన ఇంచార్జ్ కమీషనర్
– వత్తాను ఇస్తున్న టీఆర్ఎస్ వైస్ చైర్ పర్సన్
– ఆనలుగురు కౌన్సిలర్లు పేయిడ్ లేబర్సే
– చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు పరిమళ్ గుప్త
తాయారు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో ఏడాది కాలంగా ఇంచార్జ్ కమీషనర్‌గా ఉన్న ఆర్డీఓ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అంతా అవినీతికి పాల్పడ్డారని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరిమళ్ గుప్త ఆరోపించారు. గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాండూరు ఆర్డీఓ అవినీతి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, ప్రతిపక్ష కౌన్సిలర్లపై పలు ఆరోపణలు చేశారు. మున్సిపల్‌లో ఇంచార్జ్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ అశోక్ కుమార్ యేడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ ప్రగతి కుంభకోణంగా మారిందన్నారు. హరితహారం, నర్సరీల నిర్వహణపై పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు, అధికారులతో కుమ్మక్కై ప్రజాధనం దోచుకుంటున్నారని అన్నారు. 7 మంది ఉద్యోగుల రెగ్యులరైజ్ విషయంలో రూ. 12 లక్షల వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అదేవిధంగా కొత్త మున్సిపల్ భవనం ప్రారంభంలో రూ. 15 లక్షలు, మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో భోజనం ఖర్చులతో పేరుతో రూ. 2.30లక్షల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇందుకు సహకరించని కారణంగా తమపై కక్ష్య పెంచుకున్నారని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సంతకం లేకుండా ఎజెండా సమావేశం ఏర్పాటు చేశారని, అందుకనే కోర్టుకు వెళ్లడం జరిగిందని వివరించారు. దీనికి తోడూ మున్సిపల్ యాక్టు ప్రకారం బడ్జెట్‌ను ఆమోదించుకుంటే దానిలో కూడ అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి కుట్ర చేసి మళ్లీ బడ్జెట్ సమావేశాన్ని పెట్టారని, కావునే మరోసారి కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కోర్టు అంశాలపై దమ్ముంటే ఇంచార్జ్ కమీషనర్ గా ఉన్న ఆర్డీఓ వివరణ ఇచ్చుకోవాలని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాలని సవాల్ చేశారు. ఆయనపై చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు.
దేవుడు అనుగ్రహం ఉంటే ఆమెకు పదవి
మరోవైపు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలుపై పరిమళ్ గుప్త విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన వైస్ చైర్ పర్సన్, ప్రతిపక్ష కౌన్సిలర్లతో కలిసి చెంచా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో డీసెంట్ నోటు ఇచ్చిన ఎజెండాలో తాము ఆమోదించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అట్టి అభివృద్ధి పనులను ప్రతిపక్ష వార్డుల్లో చేపడితో అందులో పాల్గొనడం విడ్డూరమన్నారు. అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్షాలతో కలిపి రాజకీయాలు చేయడంలో అంతర్యమేంటో అర్ధం కావడంలేదన్నారు. అమ్మా వైస్ చైర్ పర్సనమ్మా.. మీకు దేవుడి అనుగ్రహం ఉంటే తప్పక చైర్ పర్సన్ పదవి వరిస్తుందని అన్నారు. ఇందుకోసం ప్రతిపక్ష కౌన్సిలర్లతో చెంచా రాజకీయాలు చేయుద్దన్నారు. తమ చైర్ పర్సన్ పదవి విషయంలో ఎమ్మెల్సీ నిర్ణయమేరకే నడుచుకుంటామని, అప్పటి వరకు పదవి వదిలేదని స్పష్టం చేశారు
ప్రతిపక్ష కౌన్సిలర్లు పేయిడ్ లేబర్స్
మున్సిపల్లోని అన్ని అంశాలలో అడ్డుపడుతున్న ఆ నలుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లు పేయిడ్ లేబర్స్ అని విమర్శించారు. వరాల శ్రీనివాస్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని, ఇసుక దొంగ అంటూ ధ్వజమెత్తారు. సోమ శేఖర్ వార్డులో అభివృద్ధి పనుల విషయంలో డబ్బులు డిమాండ్ చేశారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టులో ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అవినీతి ఆర్డీఓను వెనుకేసుకోస్తూ సోమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి విషయంలో ఆర్డీఓకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. అధికార పార్టీలోని వైస్ చైర్ పర్సన్ గ్రూపుకు పేయిడ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారని ఆరోపించారు.
పద్దతి మార్చుకోకుంటే అధికారులపై క్రిమినల్ కేసులు
మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ కు మద్దతుగా నిలుస్తున్న అధికారులు పద్దతి మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. మేనేజర్, ఏఈ, శానిటరీ ఇను స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్లు ఆర్డీఓ మాటలు విని కోర్టు కేసులు, ఎజెండాలపై కార్మికులను, పట్టణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న అంశాలపై మాట్లాడుతూ తప్పుదోవ పట్టించడం కోర్టు దిక్కరణ కిందకి వస్తుందని, ఈ విషయంలో అధికారులపై క్రిమినల్ కేసులు వేస్తామన్నారు. కోర్టు కేసుల విషయంలో, చైర్ పర్సన్ విషయంలో అనవసర రాద్ధాంతాలు చేస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు.
కార్మికులు ఇబ్బందులు పడొద్దు
మున్సిపల్లోని కార్మికులు అధికారులు, ప్రతిపక్ష కౌన్సిలర్ల మాటలు నమ్మొదన్నారు. 18 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవడంలో, కార్మికులకు 11వ పీఆర్సీ అమలు విషయంలో కూడ న్యాయబద్ధంగా ఉన్నామన్నారు. వారికి కూడా గతంలో బకాయి వె తనాలు అందించిన విషయాన్ని కూగ గుర్తు చేశారు. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందొందని, ఆర్డీఓ, అధికారుల మాటలు నమ్మొద్దని సూచించారు. లేదంటే రామన్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.

